News Update :

Govt provides big boon for unemployement people in AP

2 December 2011



* భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు
* ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
* 65 డిగ్రీ కాలేజీల్లో 607 లెక్చరర్ల పోస్టులు
* పాలిటెక్నిక్ కాలేజీల్లో 891 టీచింగ్
* 572 నాన్ టీచింగ్ స్టాఫ్‌
* 500 వెటర్నరీ డాక్టర్లు
* టీటీడీలో 207 ఉద్యోగాలు
* వివిధ శాఖల్లో 261 అటెండర్ల పోస్టుల భర్తీ


రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులకు కొత్త కొలువులు కల్పించనుంది. కొత్తగా రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎస్ఐ అభ్యర్థులకు వయోపరిమితి పెంచడానికి మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదు. నిరుద్యోగులకు ఆశాకిరణంగా మారుతున్నారు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి. సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కార్‌ ప్రకటిస్తున్న ఉద్యోగాల ప్రకటనలతో నిరుద్యోగుల్లో కొత్త ఆశాలు చిగురిస్తున్నాయి.

తాజాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ మీటింగ్ నిరుద్యోగులకు కోసం ఉద్యోగాలను ప్రకటించారు. 65 డిగ్రీ కాలేజీల్లో 607 లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడానికి క్యాబినేట్ ఆమోద ముద్రవేసింది. పాలిటెక్నిక్ కాలేజీల్లో 891 టీచింగ్ స్టాఫ్, 572 నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 500 వెటర్నరీ డాక్టర్ల పోస్టులు, టీటీడీలో 207 ఉద్యోగాలు నింపాలని తీర్మానించారు. వివిధ శాఖల్లో 261 అటెండర్ల పోస్టులను భర్తీ చేయడానికి క్యాబినేట్ అంగీకరించింది.

వీటితో పాటుగా కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి క్యాబినేట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. అయితే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున ఎస్ఐ అభ్యర్థుల వయో పరిమితిని పెంచటం వీలుకావటంలేదని సీఎం మంత్రివర్గ సహాచరులకు వివరించారు. అయితే గ్రూప్1, 2అభ్యర్థుల వయోపరిమితి పెంచాలంటూ కొందరు మంత్రులు చేసిన వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారు.

ఈ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదలయ్యే విధంగా చూడాలని సీఎం కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గతంలో రాజీవ్ యువకిరణాల్లో భాగంగా ఒక లక్షా 16వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలను అచరణలో పెట్టడానికి క్యాబినేట్ ఒకే సారి ఇంత భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి అమోద ముద్రవేసినట్లుయాగా సమాచారం.

ShareThis

Gallery