Thank You For Visiting My Site...Come Again For Latest Updates.....
Friends if u like my post ..Pls like and Share on FACEBOOK,TWITTER and More.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ అగ్ర స్థానంలో ఉంటారు. ఈ ఇద్దరు హీరోలను టార్గెట్ సుకున్నాడు ఓ నిర్మాత. టార్గెట్ అంటే ఇంకేదో అనుకోవద్దు. ఆ ఇద్దరితో సినిమా చేయాలనేది సదరు నిర్మాత లక్ష్యం. ఆ నిర్మాత ఎవరో కాదు సింహా, నా ఇష్టం సినిమాల నిర్మాత పరుచూరి కిరీటి. ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువున్న ఈ యువ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోలు మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. వారితో సినిమా తీయాలనేదే తన లక్ష్యమని, భవిష్యత్ లో తన లక్ష్యం నెరవేర్చుకుంటానని చెప్పుకొచ్చాడు.
డాడీ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండటంతో సినిమాల మీద ఆసక్తితో చిన్న వయసులోనే ప్రొడ్యూసర్ గా మారానని, బాలకృష్ణతో చేసిన తన తొలి సినిమా ‘సింహా’ విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. నా ఇష్టం సినిమాను మార్చి 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ సినిమా ఓ మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమా అని వెల్లడించారు.
ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘షాడో’ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, మరికొన్ని ప్రాజెక్టులు ప్రపోజల్స్ దశలో ఉన్నాయని త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు పరుచూరి కిరీటి.
Friends if u like my post ..Pls like and Share on FACEBOOK,TWITTER and More.