News Update :

Pavan's PANJAA blockbuster gaurenty Because...!!

26 November 2011



పవన్‌కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘పంజా’. విష్ణువర్థన్ దర్శకత్వంలో ఆర్కామీడియా వర్క్స్, సంఘమిత్రా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మధ్య తెలుగులో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాలపై అటు బాలీవుడ్‌లోనూ ఇటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికంతటికీ కారణం ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ నుంచి ఎటువంటి సినిమా కోరుకుంటున్నారో ఆ సినిమా టైటిల్, స్టిల్స్, పాటలు, ట్రైలర్స్ చూసాకా 'పంజా' సినిమా నుంచి ఏమి ఎక్సపెట్ చేయవచ్చు అవన్నీ ఇందులో ఉన్నాయన్న సంతృప్తితో ఫ్యాన్స్ తమ హీరోకి ఈసారి సూపర్ డూపర్ హిట్ గ్యారెంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఎదురు చూస్తున్నారు.

మొదట రిలీజ్ అయిన పంజా ట్రైలర్స్, పోస్టర్స్ ఆడియోను బట్టి ఫ్యాన్స్ తమ అంచనాలను పెంచుకోవడానికి కారణం పంజా కథలో సిరియస్‌నెస్ మిస్ అవ్వకుండానే, ఎంటర్‌ టైన్‌ మెంట్ వేలో పంజా వుంది. తర్వాత కొత్తదనం రొటీన్ కి బిన్నంగా స్టైలిష్ టేకింగ్ కచ్చితంగా కొత్తదనంగానే అనిపించింది. పవన్‌ కళ్యాణ్ రొటీన్ స్టైల్స్ భిన్నంగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పవన్‌కల్యాణ్ ఈ సినిమా చేసాడనిపించడం వలన దీనికి టైటిల్ ఎక్స్షన్ ఇవ్వవచ్చు అంటున్నారు ఫ్యాన్స్.మాస్ స్టోరి, క్లాస్ టేకింగ్, క్లాస్ సాంగ్స్, మాస్ సాంగ్స్, యూత్ కు కావలసిన ప్రేమ, పల్లెటూరిలో జరిగే మనసుకు హత్తుకునే సన్నివేశాలు, కల్‌కొత్తలో జరిగే మాఫియా బ్యాక్‌ డ్రాప్. పవన్ కల్యాణ్ విజృంభణ. అన్నీ కనిపిస్తున్నాయి. నిర్మాతలు కేవలం డబ్బు పెట్టడమే కాదు, టీం వర్క్ ఒక పద్దతి ప్రకారం జరిగి మంచి అవుట్‌ పుట్ రావడానికి ఎంతో కష్టపడ్డారు. సినిమాకు కావలసిన పబ్లిసిటీ కూడా స్పెషల్ కేర్‌తో చేస్తున్నారు. అందుకే 'పంజా' బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఇటు పవన్ ఫ్యాన్సే కాక, ఇండస్ట్రీలోనూ ధీమా వ్యక్త చేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 9 వరకు ఆగాల్సిందే.

ShareThis

Gallery