News Update :

Rajamouli Eega Story , Strengths , Twists Are Revealed..!!

29 February 2012

Thank You For Visiting My Site...Come Again For Latest Updates.....



రాజమౌళి తాజా చిత్రం ఈగ కథని ఆయనే ఓపినింగ్ రివిల్ చేసారు. అయితే అస్సలు ఒరిజనల్ గా ఆ కథ కాక తెరపై ఇంకేమి జరుగుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి...నాని,సమంత ఇద్దరూ లవర్స్. సమంతపై కన్నేసిన సుదీప్.. అనుకోని విధంగా ఓ రోజు నానిని చాలా ఘోరంగా చంపేస్తాడు. నానిని చంపింది..సుదీప్ అనే సంగతి ఆమెకు తెలియదు. ఇదే కథలో అస్సలు ట్విస్ట్ .. దీన్ని బేస్ చేసుకునే కథ,కథనం నడుస్తాయంటున్నారు.

ఇక ఈ గ్యాప్ లో నాని ... ఓ ఈగ గా పుడతాడు. ఆ ఈగకు గతం పూర్తిగా గుర్తు ఉంటుంది. అక్కడ నుంచి ఈగ.. బలవంతుడైన సుదీప్ పై ఎలా పగ తీర్చుకుంది..ఎలా తన లవర్ ని రక్షించుకుంది అన్న కోణంలో కథ నడుస్తుంది. ఆ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయంటున్నారు. తెలుగుకు జనార్ధన మహర్షి,తమిళంకు క్రేజ్ మోహన్ రాస్తున్నారు. ఇద్దరూ కామెడీలో పండిపోయిన రైటర్సే కాబట్టి సినిమా ఓ రేంజిలో ఉంటుందంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఈగ ఫస్ట్ లుక్ గురించే చర్చ.

రాజమౌళి ట్విట్టర్ లో పెట్టిన ఈ చిత్రం పోస్టర్స్ ఆయన అభిమానులనే కాక అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రంపై రాజమౌళి చాలా కాన్ఫిడెండ్ గా ఉన్నారు. చాలా చిన్న బడ్జెట్ అనుకుని నాని వంటి చిన్న హీరోతో ప్రారంభించిన ఈ చిత్రం అనుకోని విధంగా గ్రాఫిక్స్ హంగామాతో ఈ రేంజి బడ్జెట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే రాజమౌళికి ఉన్న బిజినెస్ స్టామినాని బట్టి ఈ మొత్తం పెద్దది కాదని, సినిమాపై ఉన్న భారీ అంచనాలు,మిగతా భాషల్లోకి వెళ్లే అవకాసం ఇవన్నీ బడ్జెట్ కు సహకరించే అంశాలు అని చెప్తున్నారు.



Friends if u like my post ..Pls like and Share on FACEBOOK,TWITTER and More.

ShareThis

Gallery