6 January 2012

Why Trisha can't agree to Act with Pawan Kalyan..?


గతంలో పవన్ కళ్యాణ్,త్రిష కాంబినేషన్ లో తీన్ మార్ చిత్రం వచ్చింది. యావరేజ్ గా ఆడిన ఆ చిత్రం తర్వాత మళ్లీ త్రిషను పవన్ కోసం సంప్రదించారు. అయితే అది గబ్బర్ సింగ్ కోసం మాత్రమే. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్ కోసం ప్రముఖ హీరోయిన్స్ అందరినీ సంప్రదిస్తున్నారు. మొన్న ఇలియానా,అంతకు ముందు బిపాసా ఇప్పుడు త్రిష ఆ లిస్ట్ లో చేరారు. అయితే త్రిష కూడా ఐటమ్ సాంగ్స్ చెయ్యటం ఇష్టం లేక డేట్స్ ఖాళీ లేవని తప్పించికున్నట్లు సమాచారం. ఏప్రియల్ లో షూటింగ్ జరిగే ఈ పాట కోసం దర్శకుడు హరీష్ శంకర్ రకరకాల ఆప్షన్స్ వెతుకుతున్నారు. అయితే త్రిష ఈ విషయమై నో కామెంట్ అన్నట్లుగా మీడియాకు సమాధానం చెప్పకుండా... అయినా నా గురించి బయట రకరకాలుగా మాట్లాడుకోవడం కొత్తకాదు. సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలోనే ఇవన్నీ అనుభవించాను. అదీ ఒకందుకు మంచిదే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని అని చెప్తోంది.