27 January 2012

Kajal Opens Her Relation With Prabhas..


ప్రభాస్ తో న్యూ ఇయిర్ ని ధాయ్ ల్యాండ్ లో స్పెండ్ చేసి సెలబ్రేట్ చేసుకుందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఓ ఇంగ్లీష్ డైలీ ఆమెను ప్రశ్నించింది. ఇన్నాళ్లూ ఆమె ఈ విషయం దాటి వేసిన ఆమె తొలిసారిగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ...ఓ మైగాడ్..మీడియా...ఇంకా ఈ కథను వదలదా..చూడండి..ఈ ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరినీ మరొకరితో లింక్ పెట్టి మాట్లాడుతూండటం సహజం. నేనేమీ వాటికి అతీతురాల్ని కాదు. ఇద్దరు ఒకే వృత్తిలో ఉండేవారు సింగిల్ గా ఉంటే మీడియా వారిని గుడ్ పెయిర్ గా పరిగణించి లింక్ అప్ స్టోరీలు అల్లుతుంది. కానీ మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తున్నాను...మా ఇద్దరి మధ్యా అలాంటిదేం లేదు అంది.

మరి మీరు పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారు అంటే.. పెళ్లా..నో ఛాన్స్..అస్సలు అంత టైమ్ ఎక్కడుంది..ప్రస్తుతం నేను నా డేట్స్ లో బిజీగా ఉన్నాను...అయితే తప్పనిసరిగా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటాను అంది. అంటే ప్రబాస్ ని పెళ్లి చేసుకుంటారా అని మళ్లీ అడిగితే...ప్రభాసే నే ఎందుకని..మిగతా వాళ్లను ఎందుకు చేసుకోకూడదు..అతను నాకు మంచి ప్రెండ్..కానీ అతన్ని పెళ్లి చేసుకోను...అర్ధం చేసుకోండి అంటూ ముగించింది. ప్రస్తుతం ఆమె బిజినెస్ మ్యాన్ చిత్రం విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది.


Friends if u like my post ..Pls like me on FACEBOOK