ఎప్పుడూ వార్తల్లో ఉంటూ సందడి చేసే ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యిపోయారు.ఆయన పబ్లిక్ గా కనిపించటం మానేసారు.ఆయన అజ్ఠాతవాసానికి కారణమేమిటనే చర్చ ఇప్పుడు మీడియా వర్గాల్లో మొదలైంది.నిజానికి 2010 లో ఎన్టీఆర్ పరిస్ధితి చాలా బాగుంది.అప్పుడు వచ్చిన అదుర్స్,బృందావనం చిత్రాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి.అయితే 2011 లో సీన్ రివర్స్ అయ్యింది.అయితే 2011 లో వచ్చిన శక్తి,ఊసరవెల్లి చిత్రాలు రెండూ డిజాస్టర్ అవటంతో ఆయన డైలమోలో పడ్డారు.దాంతో 2010 మ్యాజిక్ ని 2012 లో రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు.అందుకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ము చిత్రం ఉపకరిస్తుందని బావిస్తున్నారు.దాంతో పూర్తిగా ఆ చిత్రంపైనే దృష్టి పెడుతున్నారు.సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు.అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు.
![]()

