23 November 2011

Is PANJAA copy of that movie ???




ఈ మధ్య ఏ తెలుగు సినిమా తీసుకున్నా ఏదో ఒక హాలీవుడ్ మూవీకి కాపీ అనే విషయం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. కొందరు దర్శకుడు తాము కాపీ కొడుతున్నామనే విషయాన్ని ముందే చెప్పేస్తే...మరికొందరేమో సినిమా విడుదలయ్యాక దొరికి పోయి పరువు పోగొట్టుకుంటున్నారు. తాము కాపీ కొట్టామనే విషయాన్ని దర్శకులు గోప్యంగా ఉంచుతుండటంతో సినిమా విడుదలైన తర్వాత హీరోలు అభిమానుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 


పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘పంజా’ కూడా హాలీవుడ్ సినిమాకు కాపీ అనే పుకార్లు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్నారు. సినిమా ట్రైలర్ బట్టి ఈ సినిమా హాలీవుడ్ సినిమా Carlito's Way కు కాపీ అనే వాదన వినిపిస్తోంది. దర్శకుడు విష్ణు వర్ధన్ ఈ సినిమా ఆధారంగానే పంజా కథను అల్లుకున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో? సినిమా విడుదలైతే గానీ తెలీదు.